హైడ్రాకు హైకోర్టు షాక్.. 13కు కేసు వాయిదా!
రంగారెడ్డి జిల్లా ఖానామెట్‌లో భూమి వివాదంపై హైడ్రాకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నిషేధిత జాబితాలో ఉందని మాత్రమే కంచె వేయడం సరైంది కాదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ధృవీకరణ లేకుండా చర్యలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. కలెక్టర్ నివేదిక తీసుకోవాలని ఆదేశిస్తూ, కేసుల వివరాలు పరిశీలించాలని సూచించింది. విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.