'అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గెలిచింది'
సిద్దిపేట పట్టణంలోని 7వ వార్డ్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ వర్గాలకు బాకీ పడ్డ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మంజుల రాజనర్సు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.