కోవూరును అభివృద్ధికి చిరునామాగా మారుస్తా: ఎమ్మెల్యే

NLR: గ్రామాలలో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, లాంటి మౌళిక సదుపాయాలు కల్పించి తనను భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆమె కోవూరు పంచాయతి పెళ్లకూరు కాలనీ పరిసరాలలోని 4, 5, 6 వార్డులలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.