దట్టమైన పొగమంచుతో ఇబ్బందులు

ప.గో: పెనుగొండ మండల వ్యాప్తంగా ఈరోజు సోమవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని తెలుపుతున్నారు. తెల్లవారుజామునే పొలాలకు వెళ్లే రైతులు పొలాలకు వెళ్లలేక దిగాలపడ్డారు. వాహనదారులకు రోడ్లు కనిపించకపోవడంతో తమ వాహనాలను రోడ్ల వెంబడి నిలిపివేశారు.