వర్షాల భయం.. ఇంటి వద్ద జొన్న కల్లాలు

వర్షాల భయం.. ఇంటి వద్ద జొన్న కల్లాలు

KMR: మద్నూర్ మండలంలో అకాల వర్షాలు దృష్ట్యా రైతులు జొన్న ఎన్నులను కోసుకొని ఇంటి వద్ద కల్లాలు చేస్తున్నారు. ప్రస్తుతం జొన్న పూర్తిగా ఎండి కోత దశకు రావడంతో వర్షం పడితే జొన్నలు నల్లగా మారే అవకాశం ఉండటంతో రైతులు జొన్న పంట కోసేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు.