ఇంటి పన్ను వడ్డీపై 50% రాయితీ
KDP: ఇంటి పన్ను బకాయిలపై విధించిన వడ్డీలో 50శాతం రాయితీ అందిస్తున్నట్లు మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ మునికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ రాయితీ పొందేందుకు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉందనన్నారు. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చన్నారు.