VIDEO: 'చారిత్రక కట్టడాలను పునరుద్ధరించండి'
WNP: వనపర్తి పట్టణంలోని రాజావారి బంగ్లాను 1849లో ప్రథమ సంస్థానాధీశుడు రాజా రామకృష్ణారావు నిర్మించారు. బంగ్లా ఆవరణలోని అతిథి భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఈ భవనంపై పిచ్చి మొక్కలు పెరిగి ఉపయోగించడానికి వీలు లేని పరిస్థితి ఉన్నది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పిచ్చి మొక్కలు తొలగించి భవనాన్ని పునరుద్ధరించి చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించాలి.