వైఎస్‌ఆర్ విగ్రహం ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

వైఎస్‌ఆర్ విగ్రహం ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

KKD: గొల్లప్రోలు మండలం కొడవలిలో దివంగత నేత YS రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎడమ చేతిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జడ్పీటీసీ లోవరాజు ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేశారు.  విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.