బాధితులను పరామర్మించిన మంత్రి కొల్లు
కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి, అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.