అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

ATP: గుత్తిలోని ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద అన్న క్యాంటీన్‌ను సోమవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తనిఖీ చేశారు. ముందుగా క్యాంటీన్లో అందిస్తున్న టిఫిన్ను ఆయన పరిశీలించి, ప్రజలకు టిఫిన్ వడ్డించారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్ భోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.