'హైస్కూళ్లలో ఆధార్ కేంద్రాల శిబిరాలు నిర్వహిస్తాం'

ELR: ఉంగుటూరు మండలంలో హైస్కూల్లో ఆధార్ కేంద్రాల శిబిరాలు నిర్వహిస్తామని ఎంపీడీవో జీ.ఆర్ మనోజ్ తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎక్కువ డిమాండ్ ఉన్న హైస్కూల్లో శిబిరాలు నిర్వహిస్తామని, విద్యార్థులు ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలన్నారు. మండలంలో 10 హైస్కూళ్లు ఉండగా, ఆధార్ కేంద్రాల శిబిరాలకు షెడ్యూల్ తయారు చేస్తున్నామని తెలిపారు.