గుంతలు పూడ్చటంపై స్పెషల్ డ్రైవ్..!

మేడ్చల్: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యాప్తంగా వందరోజుల ప్రణాళికలో భాగంగా గుంతలు పూడ్చటంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. GSB మెటీరియల్ ఉపయోగించి, ఎక్కడికక్కడ గుంతలు పూడ్చివేస్తున్నారు. అధికారులు దగ్గరుండి మరీ, పనులు పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. మీ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి పై కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చని శుక్రవారం అధికారులు ప్రకటించారు.