ఇది నిజంగా గర్వించదగిన రోజు: కేటీఆర్
HYD: టీ- హబ్ ఒక చిన్న ఇంక్యుబేషన్‌గా మొదలై ఇప్పుడు భారతదేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అగ్రగామిగా ఎదగడం నిజంగా ఇవాళ గర్వించదగిన రోజని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ టీ-హబ్ స్థాపన దినోత్సం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దూరదృష్టి నాయకత్వంలో తాము ఓ సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను నిర్మించామని.. నేడు అదే HYDని భారతదేశపు స్టార్టప్ రాజధానిగా మార్చిందన్నారు.