VIDEO: బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్

KMM: నేలకొండపల్లిలోని బౌద్ధ క్షేత్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. ఈ సందర్భంగా బౌద్ధ క్షేత్రం ఆవరణ అంతా కలియ తిరిగారు. క్షేత్రం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివిధ శాఖల అధికారులతో చర్చించారు. పర్యాటక కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా టూరిజం అధికారి సమన్ చక్రవర్తి, లక్ష్మయ్య ఉన్నారు.