అమ్మవారి పేటలో జాతర పనుల పరిశీలన
HNK: కాజీపేట మండలం అమ్మవారి పేటలో నిర్వహించనున్న సమ్మక్క- సారక్క జాతర ఏర్పాట్లను ఇవాళ మడికొండ కిషన్ కమిటీ సభ్యులు పరిశీలించారు. జాతరకు సంబంధించి మౌలిక వసతులు, భద్రత, తాగునీరు, పారిశుధ్య పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిటీ సూచించింది.