VIDEO: ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఈదురుగాలులు

ASF: జిల్లా వాంకిడి మండలంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టడంతో ప్రజలు ఉక్కపోతతో సతమతమయ్యారు. సాయంత్రం వాతావరణం మారిపోయి ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బలమైన గాలులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.