రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
AKP: అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మున్సిపాలిటీ, మండల స్థాయిలో డిసెంబర్ ఒకటవ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్వయంగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అర్జీలను పంపించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.