వర్ష బీభత్సం.. 16 మంది మృతి, ఎమర్జెన్సీ విధింపు

వర్ష బీభత్సం.. 16 మంది మృతి, ఎమర్జెన్సీ విధింపు

పాకిస్తాన్‌లోని కరాచీలో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వివిధ ప్రమాదాల్లో ఇప్పటివరకు 16 మంది మరణించగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మావచ్ గోత్ ప్రాంతంలో రెండస్తుల భవనం కూలిపోయింది. గంటకు 80 కి.మీ. వేగంతో వీచిన గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో నగరంలోని 60% ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. దీంతో మేయర్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.