ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నిన్న గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ 14 మంది అర్జీదారుల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను చేరువ చేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.