ఏఎస్సై రవికుమార్‌కు ఘన సన్మానం చేసిన SP

PLD: పల్నాడు జిల్లాలో దీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్సై రవికుమార్‌కు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మంగళవారం ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నక్సలిజం, రవాణా సమస్యలు వంటి అనేక సవాళ్ల మధ్య కూడా రవికుమార్ ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ఆయన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.