'సర్పంచ్' టైటిల్ నచ్చింది: అయ్యర్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను క్రికెట్ ఫ్యాన్స్ 'సర్పంచ్' అని సంబోధిస్తుండటం తెలిసిందే. దీనిపై అయ్యర్ స్పందిస్తూ.. ఈ పదానికి అర్థం కూడా తనకు తెలియదని, అర్ష్‌దీప్‌ని అడిగితే 'కమ్యూనిటీ లీడర్' అని చెప్పినట్లు తెలిపాడు. మొత్తానికి ఈ టైటిల్ తనకు నచ్చిందని, ఎవరైనా అలా పిలిచినప్పుడు మంచి ఫీల్ వస్తుందని, స్ఫూర్తిగా కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు.