కాంగ్రెస్ ఇంఛార్జ్‌లతో టీపీసీసీ చీఫ్ సమావేశం
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జ్‌లతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల బాధ్యతలు తీసుకున్న నేతలు ఎన్నికల విషయంలో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఇంఛార్జులకు దిశానిర్దేశం చేశారు.