రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
RR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన హయత్ నగర్ పీఎస్ పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. పెద్దఅంబర్ పేట వైపు వెళ్తున్న సింహాద్రి ఆటో లక్ష్మారెడ్డి పాలెం సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో సింహాద్రికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు.