కలెక్టరేట్‌లో మహా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు
E.G: రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఇంఛార్జ్ రాజమండ్రి ఆర్డీవో కె.భాస్కర్ రెడ్డి హాజరై మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ప్రముఖ తెలుగు కవయిత్రి మొల్లమాంబ తన అపారమైన ప్రతిభతో తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఆయన పేర్కొన్నారు.