'గ్రామాభివృద్ధికి సహకరించాలి'
JGL: గ్రామాభివృద్ధికి సహకరించాలని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన రాయికల్ మండలం వీరాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గంగు రామస్వామి, ఉప సర్పంచ్ నర్సారెడ్డి పాల్గొన్నారు.