VIDEO: చెన్నారెడ్డిపల్లిలో మాజీ మంత్రి పర్యటన
NLR: పొదలకూరు మండలం చెన్నారెడ్డి పల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. గ్రామస్థులు కాకాణికి ఘన స్వాగతం పలికారు. కాలువలు, ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాలువలో సాగునీరు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు.