ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఏలూరులో జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని హై-డిపెండెన్సీ, ప్రసవ వార్డులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి, గర్భిణులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా సిబ్బంది పనిచేయాలని, ఆసుపత్రి సేవలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.