విషాద ఘటన.. మృతులు వీరే!

ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో వాహనం బోల్తాపడి ఆదోనికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతులు చంద్రమ్మ (31), గిడ్డయ్య (42), శశికళ(40), లక్ష్మి(28), కుమార్ (15)గా గుర్తించినరు. మరో 13 మందికి గాయాలు కాగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.