అనుమానిత ప్రాంతాల్లో పోలీసుల సోదాలు

అనుమానిత ప్రాంతాల్లో పోలీసుల సోదాలు

KDP: కడప జిల్లా ఎస్పీ ఆదేశాలతో గంజాయి వినియోగం, అమ్మకాన్ని నిరోధించేందుకు కమలాపురం సీఐ షేక్ రోషన్, SI విద్యాసాగర్, పీఎస్ఐ, సిబ్బందితో కలిసి మండలంలోని అనుమానిత ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు గంజాయి వినియోగం లేదా విక్రయం చేసిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలు సహకరించాలని కోరారు.