నూతన బస్ స్టాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో ఐటీసీ సౌజన్యంతో నిర్మించబడిన నూతన బస్ స్టాప్‌ను ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నూతన బస్ స్టాప్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందన్నారు. ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజల దైనందిన జీవితానికి మరింత సౌలభ్యం కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.