ఉద్యోగాలు కల్పించాలని జానారెడ్డికి వినతి పత్రం

ఉద్యోగాలు కల్పించాలని జానారెడ్డికి వినతి పత్రం

NLG: దామరచర్ల మండలంలో ఏర్పాటు చేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఎంక్రోచ్‌మెంట్ భూములు కోల్పోయిన తాళ్ళవీరప్పగూడెం నిర్వాసిత కుటుంబాలు, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంక్రోచ్‌మెంట్ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పించాలని జానా రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు