పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఎం
నల్గొండ: అకాల వర్షా కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం వేములపల్లి మండలంలోని మల్కా పట్నం, సల్కనూరు గ్రామాలలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 40 వేలు అందించాలన్నారు.