VIDEO: 'మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి'

VIDEO: 'మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి'

సిరిసిల్ల: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. మున్సిపల్ ముందు కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్మికులందరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.