కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ హైమావతితో కలిసి సమీక్షించారు. అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.