2 నెలలుగా వెలగని వీధి దీపాలు

2 నెలలుగా వెలగని వీధి దీపాలు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని చాబాల గ్రామంలోని 1వ వార్డులో గత 2 నెలలుగా వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో పాములు, తేళ్లు వంటివి వస్తున్నాయని మహిళలు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యను స్థానిక పంచాయతీ సెక్రటరీ, గ్రామ సర్పంచ్ స్పందించి వెంటనే పరిష్కరించాలని వార్డు ప్రజలు కోరారు.