61 రోజులు వేటకు విరామం.. మత్స్యకారుల ఆందోళన

61 రోజులు వేటకు విరామం.. మత్స్యకారుల ఆందోళన

కాకినాడ: ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు 61 రోజుల వేట విరామం ప్రారంభం కానున్న నేపథ్యంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది పరిహారం ఇంకా అందలేదని, ఇప్పుడు మళ్లీ వేట నిలిచిపోతే బతుకుదెరువు ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో తొండంగి నుంచి అంతర్వేది వరకు మత్స్యకార గ్రామాల్లో అలజడి నెలకొంది.