BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లోని దానా మెయినాపూర్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఒడిశా స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి మోడెం బాలకృష్ణ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.