ఒక్క ఓటుతో కౌన్సిలర్‌గా విజయం!

ఒక్క ఓటుతో కౌన్సిలర్‌గా విజయం!

హన్మకొండ: పరకాల 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర ఒక్క ఓటుతో విజయం సాధించారు. 17వ వార్డులో BRS అభ్యర్థి రజనీకి 368 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకు 366 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లో వచ్చిన 3 ఓట్లను కలిపి సుభద్రకు 369 ఓట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. కౌంటింగ్‌లో ఒక్క ఓటు ఎక్కువ రావడంతో సుభద్ర విజయం సాధించింది.