టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ATP: భారత మహిళా క్రికెటర్లకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఒత్తిడిలో భారత్ ఆడిన తీరు అభినందనీయమన్నారు. సెంచరీతో రాణించిన జేమీమాకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ.. ఫైనల్స్‌లో కూడా విజయం సాధించాలని ఆకాక్షించారు.