చేపల వేటకు ఎవరు వెళ్లవద్దు : దుగ్గొండి సీఐ

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో గత రాత్రి కురిసిన భారీవర్షానికి పలు రహదారులలో ఉన్న వాగులు పొంగిపొర్లుతున్నాయని కావున చేపల వేటకు ఎవరు వెళ్లవద్దని దుగ్గొండి సీఐ సాయిరమణ సూచించారు. చేపల వేట మీ కుటుంబానికి శాపంగా మారవచ్చని, వాగులు సైతం దాటడానికి ఎవరు ప్రయత్నించవద్దని కోరారు. సహాయక చర్యలకై సిబ్బందిని సైతం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.