'ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'
PDPL: ధర్మారం మండలం న్యూ కొత్తపల్లి గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నందాల మల్లేశం, కానిస్టేబుల్ తిరుపతి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.