మంత్రిని కలిసిన పోలవరం ఎమ్మెల్యే
ELR: మంగళగిరి కార్యాలయంలో సోమవారం మంత్రి నారా లోకేష్‌ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి అంశాలను మంత్రికి వివరించారు. గత ప్రభుత్వ కాలంలో పునర్నిర్మాణం జరగని పాఠశాల భవనాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే కొయ్యలగూడెం మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి సహకరించాలని కోరారు.