కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన రెబల్ అభ్యర్థులు
MHBD: తొర్రూరు మండలంలోని మడిపల్లి, చర్లపాలెం, సోమారం, గుర్తూరు గ్రామాల్లో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థుల నుంచి గండం పొంచి ఉంది. అధికారిక అభ్యర్థులతో పాటు రెబల్ అభ్యర్థులు కూడా నువ్వా... నేనా అనే రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ గ్రామాల్లో ఎవరు గెలుస్తారనే చర్చ ప్రజల్లో జోరుగా సాగుతుంది.