రెండు బైక్‌లను ఢీకొని ఆగకుండా వెళ్లిపోయిన కారు
అల్లూరి: కొయ్యూరు మండలం రామరాజుపాలెం సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కేడీపేట నుంచి రెండు బైక్‌లపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను చింతపల్లి నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో సురేష్, మంగుడు, మంగకుమారి తీవ్రంగా గాయపడ్డారు. కారు ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయిందన్నారు.