ఆలయాభివృద్ధికి రూ.30,000 అందజేత
WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీమిట్ట ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం పట్టణానికి చెందిన డాక్టర్ భీమానాయక్ సోమవారం ఆలయ కమిటీ సభ్యులు గౌని బుచ్చారెడ్డి, గౌని కోదండరాం రెడ్డి ఆధ్వర్యంలో రూ.30,000 అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సన్మానించారు. వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో జరిగే పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు.