నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NRML: నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ ఏరియాలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రోడ్ నంబర్ 4, 5 ఏరియాలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, మరమ్మతులకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.