లారీ బ్రేక్ డౌన్.. స్తంభించిన ట్రాఫిక్

లారీ బ్రేక్ డౌన్.. స్తంభించిన ట్రాఫిక్

HYD: రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లారీ బ్రేక్ డౌన్ అయింది. రోడ్డు మీద అడ్డుగా ఉండడంతో ఆరాంఘర్ నుంచి దుర్గా నగర్‌కు వెళ్లే మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లారీని పక్కకు తరలించే చర్యలు చేపట్టారు. ఇతర వాహనదారులు సహకరించాలని కోరుతున్నారు.