150 కోట్ల భూమి కోసమే ఈ కుట్ర.. జగన్ ఫైర్

150 కోట్ల భూమి కోసమే ఈ కుట్ర.. జగన్ ఫైర్

AP: విజయవాడ భవానీ నగర్‌లో మాజీ సీఎం జగన్ పర్యటించి ప్రభుత్వంపై మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నా, DEC 31 వరకు గడువు ఉన్నా ఇళ్లను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. 25 ఏళ్లుగా ఉంటున్న 42 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.150 కోట్లు విలువ చేసే ఈ 2.17 ఎకరాల భూమిని కాజేయడానికే.. తప్పుడు డాక్యుమెంట్లతో కొందరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు.