ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టు.. మన జిల్లాలోనే!

ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టు.. మన జిల్లాలోనే!

ATP: జిల్లాలో 'తిమ్మమ్మ మర్రిమాను' అనే మర్రిచెట్టుకు విశేష స్థానం ఉంది. గుమ్మగుట్ట మండలంలోని దాదాపు 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టు ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం దక్కించుకుంది. కాండం చుట్టూ దాదాపు 1100 ఊడలు ఉంటాయి. తిమ్మమ్మ అనే మహిళ తన భర్త మరణించిన అనంతరం సతీసహగమనం చేయగా..ఆమె సమాధిపై ఈ వృక్షం మొలిచినట్లు స్థానికులు చెప్తుంటారు.