మహబూబాబాద్‌లో రేపే మెగా జాబ్ మేళా..!

మహబూబాబాద్‌లో రేపే మెగా జాబ్ మేళా..!

MHBD: మహబూబాబాద్‌ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత తెలిపారు. ఉదయం 10 గంటల లోపు అర్హత పత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేసిన యువకులు అర్హులని ఆమె వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.